చింతు

జులై 3, 2006

“మనసున మల్లెల మాలలూగెనే!”

ప్రచురించిన వర్గము పాటలు — Dr.Ismail Penukonda @ 8:13 అపరాహ్నం


“మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే…
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో…
ఎన్ని నాళ్లకీ బతుకు పండెనో!

కొమ్మల గువ్వలు గుసగుసమనిన
రెమ్మల గాలులు ఉసురుసురనిన!
అలలు కొలనులో గలగలమనిన
అలలు కొలనులో గలగలమనిన!

ద్రవ్వుల వేణువు సవ్వడి వినిన
ద్రవ్వుల వేణువు సవ్వడి వినిన…
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని…
కన్నుల నీరిడి కలయచూచితిని!

ఘడియ ఏమిఇక విడిచిపోకుమా
ఘడియ ఏమిఇక విడిచిపోకుమా…
ఎగసిన హృదయము పగులనీకుమా!

ఎన్ని నాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో!”

-దేవులపల్లి కృష్ణశాస్త్రి

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

మీరు వ్యాఖ్య వ్రాయాలంటే లాగ్ ఇన్ అయి ఉండవలెను

WordPress.com లో Blog పెట్టుము.