చింతు

ఫిబ్రవరి 21, 2007

రాగి ముద్ద – పాలకూర పప్పు!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 9:42 సా.

వేడి వేడి రాగిముద్ద, పాలకూర/బచ్చలికూర పప్పులో కలుపుకొని, కాస్త నెయ్యిని అంటించి ఆవురావురుమని మింగుతూంటే… ఆహా! ఆ రుచే వేరు. పైగా అది అమ్మ చేతి వంటైతే (మా అమ్మ-నాన్న వచ్చారోచ్!) ఇక ఆ అనుభూతి చెప్పనలవికాదు. నాకిష్టమైన వంటకం ‘రాగిముద్ద-చెనిగిత్తనాల చట్నీ'(వేరుశెనగ), అయినా ఏ కూరలో అయినా(కోడికూర అని చదువుకోగలరు:) రాగిముద్దకు తగిన వంటకం లేదని రాయలసీమలో ఎవర్నడిగినా చెప్తారు.

కవిసార్వభౌముడు ఈ చాటు పద్యంలో ఇలా తెగనాడినా…

“ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్‌!”

-పూతన చేదు పాలు తాగిన బాలకృష్ణుణ్ని, గరళాన్ని మింగానని గర్వించే శివుణ్ని… జొన్నకూటిని, బచ్చలికూరను దిగమ్రింగుమని సవాలు విసురుతున్నాడు శ్రీనాథుడు.

…మా సీమలో జొన్నరొట్టెలు, రాగిముద్దలు అమృతంతో సమానం!

(జ్యోతి గారి ‘షడ్రుచుల’లో లేని వంటకాన్ని నా బ్లాగులో ఉంచుతానని… ఆమె కిచ్చిన మాటను ఇలా నిలబెట్టుకొన్నాను.)

ప్రకటనలు

11 వ్యాఖ్యలు »

 1. ఓ….. ఇది రాయలసీమ ప్రత్యేకమా?అందుకే ఎప్పుడూ ఈ కాంబినేషన్ వినలేదు,తినలేదు.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 22, 2007 @ 12:59 ఉద.

 2. నాకయితే ఇబ్బుటిగిప్పుడు రాగి సంగటి చెనిగ్గింజల చెట్నీ తినాలని పిస్తా ఉంది. అంత నోరూరిస్తారా ఇబ్బుడు మీకు కడుపు నొప్పొస్తుందిలే…మీకు కడుపు నొప్పొస్తుందిలే..నాకేమంటా.

  సంగటి లేని విహారి 😦

  వ్యాఖ్య ద్వారా విహారి — ఫిబ్రవరి 22, 2007 @ 2:01 ఉద.

 3. mI ammaa naanna vaccinanduku santOsham.
  raagimuddalu kondaru snEhitula valla nEnU tinnaa kaanI modaTnuncI alavaaTu lEkapOvaTam vallEmO anta minguDu paDalEdu 🙂
  innaaLLaki maLLi mI naTive vanTa tinnanduku congrats.

  వ్యాఖ్య ద్వారా swathi — ఫిబ్రవరి 22, 2007 @ 5:00 ఉద.

 4. అవును మీ మాట నిలుపుకున్నారు.నాకు తెలీని వంటకమే.ఎందుకంటే నేను పుట్టింది మెట్టింది అన్ని హైదరాబాదులో.అమ్మ చేస్తుంటే నేర్చుకోండి కొన్ని.మాకు చెప్పండి.

  వ్యాఖ్య ద్వారా shadruchulu — ఫిబ్రవరి 22, 2007 @ 6:47 ఉద.

 5. నేను దీనిని ఖండిస్తున్నాను. రాగి సంకటికి అత్యంత ఆప్త వంటకం నాటు కోడి ఇగురు. 🙂

  వ్యాఖ్య ద్వారా సుధాకర్ — ఫిబ్రవరి 22, 2007 @ 6:56 ఉద.

 6. తినే అలవాట్లు ఇలా తల్చుకోవడం సంతోషంగా ఉందండి.

  వ్యాఖ్య ద్వారా Mouni Mounamlo — ఫిబ్రవరి 22, 2007 @ 9:09 ఉద.

 7. నోట్లో నీళ్ళు వూరిపోయేలా చేశారు గదండి.
  ఈ సాయంత్రానికి సంగటి చేద్దామని మా ఆవిడకి చెప్పాలి. శ్రీనాధుడు చెప్పింది జొన్న కూడు గురీంచి కదా? మన జొన్న రొట్టెలు, రాగి సంగటి గురించి చప్పటి తెల్ల మెతుకులు తిన్న ఆయనకేం తెలుసు?

  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా spandana — ఫిబ్రవరి 22, 2007 @ 1:17 సా.

 8. ఈ ఆహారానం శరీర దృడత్వం, చలువ పెంచుతుందని కూడ వినికిడండోయ్. సంగటే సంగటి..ఆ సంగటి రుచులు యెవరికి తెలుసు రాయాలసీమ రత్నాలకు మించి…నా ఇష్టం.. కోడి కూరతో…సంగటే సంగటి.

  వ్యాఖ్య ద్వారా Gowri Shankar Sambatur — ఫిబ్రవరి 22, 2007 @ 1:29 సా.

 9. జొన్న సంగటి, సొద్ద సంగటి, రాగి సంగటి..పంటికి గొడ్డు కారం, ఉప్పుతొక్కు..మరపు రాని సీమ రుచులు..ఇక లాభం లేదు మా ఆవిడకి సంగటి చెయ్యడం నేర్పిచాల్సిందే

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — ఫిబ్రవరి 22, 2007 @ 7:59 సా.

 10. చాలా అన్యాయం. ఫోటో పెట్టారే, నేనేమైపోవాలి? పైగా చెనిగ్గింజల ఊరిమిండి ఒకటి. రాగిముద్దకు ఊరిమిండి, కొద్దిగా నెయ్యి తగిలించి చూడండి. మా అవ్వ తినిపించేది నాకు. ఎన్ననుకుంటే ఏం లాభం. ఇప్పుడు ఆకలిగా ఉంది. సంగటి ఊరిమిండి కావాలంటే వస్తాయా?

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 23, 2007 @ 2:29 ఉద.

 11. రాగి సంగటి, చెనిగ్గింజల చెట్నీ సరే, మరి గోంగూర పులుసుకూర మరిచారే? రాగి సంగటి లో గోంగూర పులుసుకూర కలుపుకోని తింటే, గొంతుజారు గా వుండి (స్వాతి గారు, వింటున్నారా?), స్వర్గాని బెత్తెడే దూరమనిపిస్తుంది..

  వ్యాఖ్య ద్వారా valluri — ఫిబ్రవరి 23, 2007 @ 5:17 సా.


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: