చింతు

సెప్టెంబర్ 11, 2007

శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

Filed under: పుట్టినరోజు,శ్రీమతి,సుధారాణి — Dr.Ismail Penukonda @ 2:43 ఉద.

అప్పుడెప్పుడో 98’లో ప్రేమలో పడ్డాక వచ్చిన తొలి పుట్టినరోజు చేసిన హంగామా అంతా గుర్తుకు వచ్చి, మళ్లీ అంతలా కాకున్నా ఈసారీ అచ్చెరువొందేలా ఒక చిన్న యుక్తి పన్నాను – మరేం లేదు, ఓ చిన్న బహుమతి తనకు తెలియకుండా కొన్నానంతే! సుధా’నా’రాణీ… అందుకో జన్మదిన శుభాకాంక్షలు!

అమ్మకు మా తరఫు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు! అమ్మ కడుపు చల్లగా-అత్త కడుపు చల్లగా బతుకు అమ్మా వెయ్యేళ్లు పచ్చగా… సుహాస్-శ్రేయా సుహేల్ (హాసూ-హనీ)-సెప్టెంబరు 11,2007.

(ఇలా అంతర్జాలంలో శుభాకాంక్షలు చెప్దామనే ఆలోచన కలిగించిన మన జ్యోతక్క టపాలకు ధన్యవాదాలతో…)

ఆగస్ట్ 21, 2007

మా ‘హాసు’కు + మా ‘బాసు’కు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Filed under: చిరంజీవి,పుట్టినరోజు,సుహాస్ — Dr.Ismail Penukonda @ 5:28 ఉద.

ఇంతలోనే ఐదేళ్లూ ఎలా గడచిపోయాయబ్బా! ఆగష్టు 21,2002 ఉదయం 6గంటలకు నా చేతుల్లో మొదటిసారి వాన్ని చూసుకొన్నప్పుడు నాలో ఏదో తెలియని ఉద్వేగం! మా శ్రీమతిని ఒక్క రోజు ఓపిక పట్టకూడదూ (మెగాస్టార్-ఆగష్టు 22!) అన్నానని, ఇప్పటికీ అందరూ నన్ను ఎగతాళి చేస్తూంటారు.కానీ మనం మనమే! తొమ్మిది నెలల (తల్లి కడుపులో ఉన్నప్పుడు)వయస్సులో మా వాడు చూసిన(విన్న) తొలి తెలుగు చిత్రం ‘ఇంద్ర’. అందుకే అప్పట్లో వాన్ని ‘ఇంద్ర’ అనే పిలిచేవారు. అందుకేనేమో మా వాడికిష్టమైన ఇంగ్లీషు రైమ్ ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్! చిరంజీవి మెగాస్టార్!’. ఇక వాళ్ల తాత నేర్పించిన ఊతపదం ‘శంకర్ దాదా – ఎం.బి.బి.ఎస్! పి.సుహాస్ ఐ.ఏ.ఎస్!’ కానీ ఇప్పుడేమో తీరం ఆవల ఉన్నాడాయె. ఈ సోదంతా ఎందుకంటే మా వాడు, నా బ్లాగు చూస్తూంటాడు…అందుకే ఈ టపా. హాసూ…మరోసారి నీకు నా హార్థిక జన్మదిన శుభాకాంక్షలురా! బాసూ…నీక్కూడా కాస్త ముందుగా!

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.