చింతు

మార్చి 5, 2007

సాలభంజికల ‘నాగరాజు’ గారు, మన ‘రానారె’, ఐశ్వర్యారాయ్!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 2:39 ఉద.

ఇదేంటీ ఈ బ్లాగు మకుటం వైవిధ్యంగా ఉంది అనుకొంటున్నారా? ఆగండాగండి చెబుతాను. ఇప్పుడే ‘బంటీ ఔర్ బబ్లీ’ అనే హిందీ చిత్రరాజాన్ని చూశాను. ఇంతకు ముందే చూసినా మా వాళ్లు చూస్తోంటే, నేను ‘కజరారే…కజరారే’ గీతం మాత్రం చూశానన్న మాట. ఆ పాటను చూడాలనుకోవటంలో నా ఉద్దేశ్యమైతే… అప్పటికి తెలియకున్నా, ఇప్పుడు మొగుడు-పెళ్లాలు కాబోతున్న ‘అభిషేక్-ఐశ్వర్య’, మామ-కోడలు కాబోతున్న ‘అమితాబ్-ఐశ్వర్య’లను ఆ పాటలో ఉత్సాహంగా చేసిన నృత్యాన్ని చూసి మురిసిపోదామనే!

కానీ ఆ పాట చూస్తూంటే ఐశ్వర్యారాయ్ అయితే కన్పించింది కానీ…విచిత్రంగా నాకు అమితాబ్ స్థానంలో మన ‘నాగరాజు’గారు, అభిషేక్ స్థానంలో మన ‘రానారె’ వీరవిహారం చేస్తున్నట్టు కాన్పడింది:-) మీరు నమ్మకపోతే ఇక్కడ, మరియు ఇక్కడా నొక్కండి, అందులో వారి చిత్రాలను చూశాక మళ్లీ ఇక్కడ ఘాట్టిగా మరోమారు నొక్కండి! నేను చెప్పింది తప్పంటారా? మరి ‘పచ్చకామెర్లు’ వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు (అది నిజం కాకపోయినా) ఈ బ్లాగు కామెర్లు వచ్చాక లోకంలో ఏది చూసినా బ్లాగెయ్యాలనీ, లేదా ఎవరిని చూసినా మన బ్లాగ్మిత్రులు కన్పించడం మొదలయ్యింది:-) దీనికి మందేమిటి చెప్మా?

(ఇందుమూలంగా యావన్మంది తెలుగు బ్లాగు ప్రజానీకానికి తెలియజేయునదేమనగా ఇది నా పుర్రెలో పుట్టిన అవిడియాకు బ్లాగు రూపమని, హాస్యానికే గానీ అపహాస్యం చేయడానికి కాదనీ తెలుసుకోవలసిందిగా ప్రార్థన.)

6 వ్యాఖ్యలు »

  1. అవునవును .. ఈ మధ్య చాలా మంది నన్ను మహేష్ బాబు అనుకొని ఆటోగ్ర్రఫ్ ల కోసం తెగ విసిగిస్తున్నారు !!

    ఏం చెయ్యాలి ఉప్మా ?? 😉

    వ్యాఖ్య ద్వారా Krishna — మార్చి 5, 2007 @ 6:00 ఉద.

  2. ఐశ్వర్యరాయ్ బదులు ఎవరు కనపడ్డారేంటి? 😉

    వ్యాఖ్య ద్వారా Naveen — మార్చి 5, 2007 @ 7:33 ఉద.

  3. డాక్టరయ్యి ఉండి మీకే ఇలా కనపడితే ఎలాగండి.మీ ఆవిడతో పాటు ఆసుపత్రిలో చేరిపోండి. ఈ బ్లాగు పిచ్చి వదులుతుంది.ఐనా రానారే వెనకాల పడ్డారేంటీ?పాపం పసివాడు.పాలబుగ్గలవాడు.వదిలెయ్యండి.

    వ్యాఖ్య ద్వారా shadruchulu — మార్చి 5, 2007 @ 12:07 సా.

  4. కృష్ణా…
    ఇంకేముంది కాస్త అంజాన్ కొట్టు(తెలిసీ తెలియనట్లు ఉండు)…కలిసి ఉప్మా తినొచ్చు!(పోకిరి చూసే ఉంటారుగా:-)

    నవీన్…
    ఐశ్వర్యారాయ్ ఉండగా ఇంకా ఎవరైనా ఎందుకు కనపడతారు అబ్బాయ్!

    జ్యోతి గారు…
    ఇది కాంప్లిమెంటే కానీ కామెంటు కాదు!రాజుగారికి- నాకు, నాకు-రానారెకు మధ్య గురు-శిష్య సంబంధం ఉంది లెండి…అందుకే ఆ చనువుతో అప్పుడప్పుడూ ఇలా:-)

    వ్యాఖ్య ద్వారా Dr.Ismail — మార్చి 5, 2007 @ 4:47 సా.

  5. మీరు చెప్పింది నిజమేనండి.నిన్న టివీలో ఆ పాట చూస్తుంటే నాకూ అలానే అనిపించింది.రాజుగారి పిల్లిగడ్డం రము నల్ల కళ్ళద్దాలు,అమితాబ్,అభిషేక్ లానే అనిపించారు.ఇద్దరూ సరసులే.అల్లరి కూడా చేస్తారు.నిన్న తప్పుగా మాట్లాడా క్షమించండి.

    వ్యాఖ్య ద్వారా shadruchulu — మార్చి 6, 2007 @ 4:55 ఉద.

  6. ఇది చాలా అన్యాయం రాయల వారు. రానారేకి తండ్రినవ్వటానికి నాకనందమే గాని, ఐశ్వర్యారాయ్ నాకన్నా ఐదేళ్ళు పెద్దదండీ. అందుకే, అభిషేక్ కి వదిలేసా, లేకపోతే గట్టి పోటి ఇచ్చేవాణ్ణే.

    వ్యాఖ్య ద్వారా Nagaraju Pappu — మార్చి 7, 2007 @ 1:00 సా.


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.